Saturday, 12 May 2012

అమ్మ కోసం తపన

!!!మాతృమూర్తులందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు!!! 


అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు .ఎందుకంటే ప్రతివక్కరు శిశు దశ నుంచి ఆ ప్రేమను పొంది  ఒక మనిషి గా  పరిపక్వత చెందుతారు ఈ పరిణామంలో ప్రతిక్షణం ప్రతిఫలించే తల్లిప్రేమ నిర్వచించలేనిది.


మాతృదినోత్సవ సందర్భంగా మరియు వనజవనమాలి గారి అత్తమ్మలో అమ్మను చూస్తున్న వారి మహోన్నతమైన మనస్సుకు స్పందించి ,నాకు దగ్గరిబందువులలో ఒక అమ్మ దీనమైన జీవితకథ గురించి ఈ పోస్ట్ రాయాలనిపించింది.

ఆ అమ్మ జీవితచరమాంకంలో అనుభవిస్తున్న శేష జీవితాన్ని చూస్తే హృదయం ద్రవించక మానదు.
ఒక విషయమేమిటంటే ఆమె ఆరోగ్యంగా వున్నపుడు సంతానమే కాకుండా బంధువర్గం అంతా ఎంతో ప్రేమగా వుండేవారు.కాని నిజమైన అవసరమైన అవసానదశలో అందరూ దూరమయ్యారు సేవ చెయ్యవలసిన పరిస్తితి వస్తుందనే భయంతో .

కూతుర్లమీద ప్రేమతో ఎప్పుడు తపించే ఆమె ,వాళ్ళు నన్ను చూడటంలేదే అని కాకుండా నేను వాళ్ళని చూడలేకపోతున్నాను అని ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది.వాళ్ళ వాదన ఏమంటే మా సంసారాలు మాపిల్లలని మేము చూసుకోవాలి కదా అని.కాని వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి పడే తపనలాంటిదే కదా ఆమెది కూడా అని ఎంతో కన్వినిఎంట్ గా విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది .
కూతుర్లుకూడా మాతృమూర్తులే కదా మరి ??

ఆమె కోడలు కూడా ఆమె చాదస్తాన్నే విసుక్కుంటుంది కాని తన తల్లిలాగా ఎప్పటికీ గౌరవించలేకపోతున్నది. మరీ ఆమె కూడా మాతృమూర్తే కదా ????

వృద్ధులు అవసానదశలో శిశువులలాగ ప్రవర్తిస్తారు అని ఎక్కడో చదివాను. దానినే చాదస్తంగా భావించి విసుక్కుంటూ వుంటారు . కాని అందరూ వాళ్ళ చివరిదశలో ఎంతోకొంత చాదస్తంగా ప్రవర్తించబోతారని ఎందుకు ఆలోచించరు .మనుమలు మనుమరాళ్ళు విసుక్కుంటుంటే ఎందుకు వారించరు ???

ఆమె కొడుకు ఒక్కడే బాగా చూడటం కన్నా కుతుర్లూ, కోడలు, మనుమలు మనుమరాళ్ళు అందరూ ప్రేమగా మాట్లాడాలని ఆమె తపన , ఎవరూ చీదరించుకోకుండా విసుక్కోకుండా ఆమె జీవితం ముగియాలని ఆమె కొడుకు పడే తపన .


19 comments:

  1. అంత విచక్షణే ఉంటే ఇప్పుడు ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండేవి కాదు. పిల్లల్ని హాస్టల్లో చేర్పించినట్టు తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో చేర్పించరు!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారు
      నా పోస్ట్ మీకు నచ్చి వెంటనే స్పందించినందుకు.
      మీరన్నట్లు పెద్దలు పిల్లల్ని వారి భవిష్యత్ పెంచడానికి హాస్టల్లో పెడితే,
      పిల్లలు, పెద్దలని వారి భవిష్యత్ త్వరగా తుంచడానికి ఆశ్రమాలలో పెడతారు.
      మీ పోస్ట్స్ ఈ మధ్య కనపడటం లేదు.
      మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

      Delete
  2. శ్రీను గారు నిజమే! ప్రేమ పల్లమెరుగు... ప్రేమ ముందుకే ప్రసరిస్తుందట.
    పిల్లలే మన భవిష్యత్తు కదా...అని వారి మీద చూపే ప్రేమ, శ్రద్ద , పెద్దవారి మీద చూపరు. తప్పు అని అందరికి తెలుసు..కాని ఆ guilt ని తప్పించుకోడానికి, మా సంసారాలు, పిల్లలు అంటూ, "స్వార్ధం" గా మిగిలిపోతున్నారు.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారు!
      మీస్పందనకు ధన్యవాదాలు.
      మీరన్నట్లు పిల్లలు మన భవిష్యత్తే కాని
      జీవిత చరమాంకంలో పెద్దలు కూడా పిల్లలతో సమానమే కదా
      అందుకే ప్రేమని కూడా సమానంగా పంచే అవసరం వుందని నా అభిప్రాయం మాత్రమేనండి.
      మీ చక్కని విశ్లేషణకు మరియొకసారి ధన్యవాదాలు.

      Delete
  3. శ్రీను,
    మాతృమూర్తి ముసలి వయసులో పడే బాధ ,తపన, ఆవేదన చాలా ప్రష్పుటముగా విషదీకరించావు.ఈ contemporary era లో -కాబోయే ముసలి తల్లులు ఇప్పుడున్న ముసలి తల్లులను పట్టించుకోవడం లేదు.జీవితంలోని చివరంకములోఉన్న ఆ మాతృమూర్తులు expect చేసేది ఓ తియ్యని పలకరింపు.ఆ పలకరింపులు కూడా కరువై వారు పడే బాధ వర్ణనాతీతం.సాటి స్త్రీ, సాటి స్త్రీ యొక్క ఆవేదనను అర్థము చేసుకోలేకపోతున్నందులకు బాధ కల్గుతోంది. అయిన తనదాక వస్తే గాని వారికి తెలియదు.

    ReplyDelete
    Replies
    1. హరి
      నీ స్పందనకు మరియు ఎప్పటిలాగే నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు.
      మాతృమూర్తి స్తానంలో వున్న కోడలుకి తన భర్త మాతృమూర్తి యొక్క తపన అర్థంకాకపోవడం నిజంగా విచిత్రం.
      వనజవనమాలి గారి లాగ కోడళ్ళు అందరూ నడచుకుంటే వృద్ధుల వ్యధలను చదివే అవసరం వుండకపోవచ్చు.
      ఏమంటావు హరి. నిజంగా వనజావనమాలి గారికి హాట్సాఫ్.

      Delete
  4. వృద్దుల దయనీయ జీవితం..కడుపు నిండక కాదు. మనసారా ప్రేమగా పలకరించే ఓ..పలకరింపు లేక అనాధలుగా మిగిలిపోతారు.
    మనుషుల్లో ఏ మాత్రం సంస్కారం ఉన్నా.. మనని కానీ మనకోసం అహర్నిశంపాటు పడిన వాళ్ళకు మనమివ్వవలసింది.. పిడికెడంత ప్రేమ.ఆదరణ..అది చాలు.
    మనిషి సేవా భావం,ప్రేమ భావం తన ఇంట్లో తన తల్లి దండ్రుల వద్దనుండే..ప్రారంభం కావాలి.అలా జరిగిన నాడు వృద్ద ఆశ్రమాలు ఉండవు అని అనుకుంటాను.
    ఓ..తల్లి మనసులోని ఆవేదనని ..తెలియ పరచి..ఈ పోస్ట్ చదివినప్పుడు అయినా.. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి ఆన్ లిప్త పాటు ఆలోచన అయినా కలిగించారు చూడండి..అందుకు మీకు అభినందనలు.
    ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. వనజావనమాలి గారు
      మీ స్పందనకు ధన్యవాదాలండి.
      మీరు అమ్మ మీద రాసిన పోస్ట్స్ నాకు ప్రేరణ ఈ పోస్ట్ రాయడానికి.
      పెద్దలమీద మీకున్న ప్రేమానురాగాలకు మీకు చేతులెత్తి నమస్కరించాలి.

      Delete
  5. నిజమేనండీ పెద్దలు ప్రేమతో పలకరించే పిలుపు కోసమే పరితపిస్తారు..
    కానీ పిల్లలు పెరిగే కొందీ వాళ్ళతో మాట్లాడేదేముందిలే అన్న భావంతో వాళ్ళను నిర్లక్ష్యం చేస్తారు..
    ఆ నిర్లక్ష్యమే ఎంతగానో బాధపెడుతుంది.
    మీ "అమ్మ కోసం తపన" ఇవన్నీ నిజమేకదా అనిపించిందండీ ..

    ReplyDelete
    Replies
    1. రాజి గారు
      మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు
      నా పోస్ట్ మీకు నచ్చి స్పందించినందుకు ధన్యవాదాలు
      మీకు మీ అమ్మగారి మీద ఎంత ప్రేమో మీ బ్లాగ్ ద్వారా అర్ధమయింది
      మీరు మరియు వనజగారి లాంటి వాళ్ళు ఎంతోమంది కోడళ్ళకు కనువిప్పు కలిగిస్తారని నా అభిప్రాయం

      Delete
  6. ఓహ్, ఈ రోజు తల్లి దినం కదూ, మర్చేపోయాను. అదే అనుకున్నా ఏమిటా ఇలాంటి సెంటిమెంటు వ్యాసాలు బ్లాగుల్లో కనిపిస్తున్నాయా అని.
    అందరికీ తల్లి దినం శుభాకాంక్షలండి.

    ReplyDelete
  7. Anonymous గారు
    ధన్యవాదాలండి మీ స్పందనకి
    సెంటిమెంట్ కాదండి మనకు జన్మనిచ్చిన తల్లి గురించి నాలుగు మంచిమాటలు చెప్పుకునే ఆవకాశం.

    ReplyDelete
  8. జీవితమంతా ప్రేమని పంచి ప్రేమించే మనసే "అమ్మ". పెద్దవాళ్ళయ్యక చిన్నపిల్లల్లా మారి ఎదిగిన పిల్లల నుంచి కాస్తంత ప్రేమ ఆశించటం ఒక్కటే అమ్మలు ఆశించేది. ఆ ఆశించటంలోనూ ప్రేమే ఉంది. అది కూడా ఇవ్వలేని పిల్లలు తమూ దానికోసమే ఆఖరిన తపిస్తారన్నదీ సత్యం. ఆ సత్యం తెలుసుకునే సరికి అమ్మ కనిపించదు. ఎదురుగా ఉన్న ప్రేమ రూపాన్ని ప్రేమగా చూసుకోగలిగిన జీవితమే ధన్యము.
    మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. చిన్నిఆశ గారు
      చక్కగా స్పందించారు ధన్యవాదాలండి.
      'ప్రేమ స్వరూపాన్ని ప్రేమగా చూసుకోగాలిగిన జీబితమే ధన్యం'
      ఎంత బాగా చెప్పారండి అవును ప్రేమని గుర్తించగలిగిన వాళ్ళే ధన్యులు.

      Delete
  9. శ్రీను గారు ఇప్పటి కాల పరిస్తితి లో పిల్లల్ని చదువులకు దగ్గరగా బంధాలకు దూరంగా పెద్దలే ఉంచుతున్నారు కనుక పిల్లల నుండి ఎక్కువ స్పందన ఆశించ లేము.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు
      ధన్యవాదాలండి చక్కగా స్పందించారు
      మీరన్నట్లు పెద్దలే పిల్లలకు అందవలసిన విలువలను దూరంచేస్తున్నారేమో

      Delete
  10. ఇప్పటి కాలంలో పరిస్ధితుల గురించి చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete

  11. లాస్య గారు నమస్తే
    స్పందించినందుకు ధన్యవాదాలండి
    నేను మీ పోస్ట్ ఆలస్యంగా చూడడం జరిగింది.
    అందుకే వెంటనే reply ఇవ్వలేక పోయాను

    ReplyDelete
  12. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    లాస్య రామకృష్ణ

    బ్లాగ్ లోకం

    ReplyDelete