Saturday 25 February 2012

బాల్యం

అమూల్యమైన బాల్యం !!

ప్రస్తుత పరిస్థితులలో పిల్లలు కోల్పోతున్న అమూల్యమైన
బాల్యాన్ని తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.

చిన్న చిన్న ఆటలు సరదాలు ఇప్పుడు ఏవి?
మూడో ఏట పుస్తకాల మోత మొదలై
పదిహేనవ ఏటితో IIT నే పరమావధి
అన్న మోతతో మనస్సులు బరువెక్కుతున్నాయి


మరొ రెండేళ్ళు కార్పొరేట్ కాలేజిల పుణ్యమా అని
కారిడార్లలో, మెట్లమీద, వరండాలలో,
చెట్లకింద రుబ్బుడు చదువుతో మిగతా బాల్యం గడిచిపోతుంది.


తర్వాత సహజ సున్నితత్వం కోల్పోయి
materialistic డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యి
మళ్ళీ జీవిత చక్రాన్ని తిప్పేస్తారు
మనుషులు మనుషుల్లా కాకుండా
యంత్రాల్ల బ్రతికేస్తూ జీవన గమనాన్ని సాగించేస్తారు
 !!!!    

Wednesday 22 February 2012

దైవత్వం
సూర్యోదయం కాక మునుపే లేచి చన్నీళ్ళ స్నానం చేసి
అత్యంత భక్తి శ్రధ్ధలతో దేవుడిని పూజించి ఆ తరువాత
దైనందిన కార్యక్రమం లో పనిపిల్లని హింసించే గృహిణిలో దైవత్వం వుంటుందా?


అదే భక్తి శ్రధ్ధలతో దేవుడిని కొలిచి హడావుడిగా office కి వెళ్ళి
లంచం లేనిదే పనిముట్టుకోని వ్యక్తిలో దైవత్వం వుంటుందా??


వీరికన్నా ఇంకా ఎక్కువ భక్తి శ్రధ్ధలతో దేవుడిని ఆరాధించి
ఆ దేవుడి సొమ్మునే కాజేసే పూజారికి దైవత్వం వుంటుందా???


అసలు దేవుడిని నేనే అని అమాయకులని మోసం చేసే
దొంగ బాబాలలో దైవత్వం వుంటుందా????


ప్రతీ పండుగకు దేవుడి గుడులముందు బారులు తీరి
దేవుడిని దర్శించి, పులకించి పునీతులమైనామని మురిసి
మళ్ళీ ప్రతినిత్యం మోసాలు ,కుట్రలు ,కుతంత్రాలు చేస్తూ
జీవించే వాళ్ళు ఆలోచిస్తారా దైవత్వం గురించి ?????


కులమతాలకతీతంగా దేవుడిని నమ్మి కొలిచి
తరించే భారతీయులు నూటికి తొంభై శాతం అనుకుంటే
వారే సన్మార్గులని మనము భావిస్తే
నూటికి పది శాతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా 
మోసగాళ్ళు దోపిడీదారులు
మన కర్మభూమిలో ఎందుకున్నట్లు??????    

Monday 20 February 2012

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

Sunday 12 February 2012

భారతీయులు మహనీయులు!!

రోజూ త్రాగటానికి సరిగా నీళ్ళు లేకపోయినా!
రెందుపూటలా తినడానికి తిండి లేకపోయినా!


వుంటానికి గూడు లేకున్నా !
పిల్లలని చదివించడానికి బడి లేకపోయినా!

ఊరికి రోడ్డు లేకపోయినా!
ఉన్న రోడ్డు గతుకులమయం అయినా!

గతుకుల రోడ్డులొ ప్రయాణించే డొక్కు బస్సు వున్నా!
కష్టపడి పండించిన పంటలు పావలా కి కొనబడి రూపాయికి అమ్మబడుతున్నా!

లంచం కట్టకుండా డ్రయవింగ్ లయసెన్స్ తెచ్చుకోలేకపోయినా!
లంచం లేకుండ ఏ గవర్నమెంట్ పని చేయించుకోలేకపోయినా!

గవర్నమెంట్ పథకాలు అన్నీ పూర్తిగా దక్కకపోయినా!
నాయకులు,అధికారులు అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నా!

రక్షక భటులతో రక్షనే కొరవైనా!
న్యాయ వ్యవస్థలో పూర్తిగా న్యాయం దక్కకపొయినా!

కబ్జాదారులతో డ్రెయనేజ్ అస్థవ్యస్థమయి వర్షాకాలంలో రోడ్డులు కొట్టుకుపోతున్నా!
రోడ్డు మధ్యలో గుళ్ళు మసీదులు కట్టబడి ప్రయాణంలో ఇబ్బందులు వున్నా!


అన్నీ సర్దుకుపోతూ జీవచ్చాల్లా బ్రతుకుతూ,
ఎన్నికల్లో నాయకుల కటౌట్లకు దండలు వేస్తూ,
వాళ్ళ చెప్పులు నెత్తిన పెట్టుకుని,
మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూ మురిసిపోతున్న
మన భారతీయులు మహనీయులు కారా????
           

Wednesday 8 February 2012

ఇలా కూడా లెక్కలు చేయవచ్చు

మన క్రికెట్


మన దేశం లో క్రికెట్ అనేది ఒక ఆట అని మరచిపోయారేమో అని అనిపిస్తుంది ప్రస్తుతం.
ఆటగాళ్ళకు డబ్బులు,ఆడించేవాళ్ళకు డబ్బులు,చూపించే వాళ్ళకు డబ్బులు,బెట్టింగ్ కాసే వాళ్ళకు
డబ్బులు ఇలా ఆట అంతా డబ్బు మయం.


ఒకోసారి ఆటగాడు duck ఔట్ అయి casual గా  TV  ముందు కూర్చున్నవారి ని ఒరే వెర్రోళ్ళలార
ఏమి చూస్తున్నార్రా అని అంటూ వెళుతున్నట్లు అనిపిస్తుంది.

ఆటగాళ్ళు బాగా ఆడితే డబ్బులు చాలా ఎక్కువగ వస్తాయి
బాగా ఆడకపోతే  డబ్బులు కొంచం ఎక్కువగ వస్తాయి అంతే తేడా

My dear youth ఆలోచించండి మనకి ఎంత time waste అవుతుందో క్రికెట్ వలన......

     

Thursday 2 February 2012

వాణిజ్య ప్రకటనలు


ఒక product తయారు చెసే సంస్థ దాని marketing  కోసం ఏమైన చెయవచ్చు.
కాని ఒక well established profession (?) లో ఉన్న heros, Ads లొకూడ సంపాదించేద్దమని నానా గడ్డి కరుస్తున్నారు

ఒక దొంగ కూడ ఇంకొక దొంగ area లో దొంగతనం  చేయదం, అట్లానే ఒక బెగ్గర్ ఇంకొక బెగ్గర్ AREA కి
వెల్లి అదుక్కోవడం చేయరు ఎందుకంటే వాళ్ళు ఒక నీతిని పాటిస్తారు.

అదే మన great HEROS(??) minimum నీతిని వదిలేసి అదే profession లో  వున్న ఇంకొక వ్యక్తి (MODELS) కడుపు కొట్టడం చేస్తున్నారు  సిగ్గు యెగ్గు లేకుండా !!ఇది ఎంత హేయమైన చర్య!!!
ఎవడైన సరే ఇంకొకరికి అన్యాయం చేయని వాడే నిజమైన HERO నా అభిప్రాయంలో. ఏమంటారు???