Wednesday 22 February 2012

దైవత్వం
సూర్యోదయం కాక మునుపే లేచి చన్నీళ్ళ స్నానం చేసి
అత్యంత భక్తి శ్రధ్ధలతో దేవుడిని పూజించి ఆ తరువాత
దైనందిన కార్యక్రమం లో పనిపిల్లని హింసించే గృహిణిలో దైవత్వం వుంటుందా?


అదే భక్తి శ్రధ్ధలతో దేవుడిని కొలిచి హడావుడిగా office కి వెళ్ళి
లంచం లేనిదే పనిముట్టుకోని వ్యక్తిలో దైవత్వం వుంటుందా??


వీరికన్నా ఇంకా ఎక్కువ భక్తి శ్రధ్ధలతో దేవుడిని ఆరాధించి
ఆ దేవుడి సొమ్మునే కాజేసే పూజారికి దైవత్వం వుంటుందా???


అసలు దేవుడిని నేనే అని అమాయకులని మోసం చేసే
దొంగ బాబాలలో దైవత్వం వుంటుందా????


ప్రతీ పండుగకు దేవుడి గుడులముందు బారులు తీరి
దేవుడిని దర్శించి, పులకించి పునీతులమైనామని మురిసి
మళ్ళీ ప్రతినిత్యం మోసాలు ,కుట్రలు ,కుతంత్రాలు చేస్తూ
జీవించే వాళ్ళు ఆలోచిస్తారా దైవత్వం గురించి ?????


కులమతాలకతీతంగా దేవుడిని నమ్మి కొలిచి
తరించే భారతీయులు నూటికి తొంభై శాతం అనుకుంటే
వారే సన్మార్గులని మనము భావిస్తే
నూటికి పది శాతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా 
మోసగాళ్ళు దోపిడీదారులు
మన కర్మభూమిలో ఎందుకున్నట్లు??????    

4 comments:

  1. మాములుగా చెప్పే సమాధానము..ఏదో ఒక రోజు పాపం పండుతుంది.. దొరికిపోతారు( నాశనం అయిపోతారు) అంటారు.. నిజానికి తప్పు చేశేవారికి తొరగా శిక్షలు లేక భయం లేకుంట పోయింది.. ఎప్పుడో అవుతుందిలే అని జనాలు ఫిక్స్ అయిపోయారు.. తప్పులకి కటినమైనా శిక్షలు ఉంటె ఇలా ఎవరు చేయరు.. ముంబాయి మారణహోమమునే చుడండి వందల మంది మరణానికి కారణం అయిన వ్యక్తికీ విలాసాలు ఇప్పటికి 30 కోట్లు కర్చుచేశారు అంట( ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఏమైనా చేయండి ఎంత మారనహోమమైన చేయండి కాని సైనేడ్ తీసుకోని చనిపోకండి..తప్పించుకోవటానికి వీలు కుదరకపోతే దొరికిపొండి వి ఐ పి లాగ చూసుకుంటారు అన్ని చేసి సివరకు జీవిత ఖైది అని కొన్ని రోజులు జైలో ఉంచి వదిలేస్తారు అనుకుంట్టునారు అని న్యూస్) .. అదే సమయం లో గిరజనుల అభివృది కోసం పాటుపడుతున్న కిషన్ జి కి ఎంన్ కౌంటర్ ఇది ఎంత అన్యాయము కదా.. కాని అల చేశేవారు ఆ తప్పు చేసిన క్షణమే మనిషిగా మరణించాడు..

    ReplyDelete
  2. థాంక్స్ తెలుగుపాటలు గారు తక్షణ స్పందనకు
    ఇలా ప్రోత్సహించడం చాలా సంతోషం
    మీరన్నట్లు ఎప్పుడో ఒక సారి పాపం బద్దలవకపోదు.

    ReplyDelete
  3. sreenu ee roje vatchaanu.adirindi post.really appreciable.excellent

    ReplyDelete
  4. thank you hari nuvvu mechchukunnanduku
    chaala santoasham

    ReplyDelete