Saturday, 31 March 2012

కళ్ళు పోతాయండి బాబూ...

ఒకప్పటి పాటలు చూస్తూంటే ఎంతో చల్లగా 
ఆహ్లాదంగా ఉంటుండేవి !
అబ్బో ఇప్పటి పాటలు 
కళ్ళు జిగేల్మని కరకరలాడుతూ 
కంటిచూపు దెబ్బతినేట్లు ఉన్నాయి !!
అప్పటి ఇప్పటి పాటల వ్యత్యాసం మీరే గమనించండి
అప్పటి అందాల హరివిల్లు లాంటి పాట (40 షాట్స్ సాంగ్ మొత్తానికి )

గుండె దడదడలాడించే ధడాక్ ధడాక్ పాట (140 షాట్స్ సాంగ్ మొత్తానికి )

ఒక సాంగ్ మొత్తం చూసేటప్పటికి కళ్ళమీద పడే స్ట్రెయిన్ ఎంత ఎక్కువో అర్ధమౌతుంది 
ప్రస్తుత నటులు హావభావాల ప్రకటనలో ఎక్కువ కష్టపడకుండా చేసే గిమ్మిక్కు తప్ప 
టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఏమీ కాదని నా అభిప్రాయము. అంతే కాకుండా చూడకూడనివి 
చూపిస్తే కళ్ళు పోక ఏమౌతాయి ????? 



Thursday, 29 March 2012

పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా??

జీవితాన్ని ఇక ముందుకు సాగించలేక అత్యంత విషాదంగా 
ఒక రైతు పురుగులమందు తాగుతూ ఉంటే వివిధ భంగిమలలో చిత్రీకరిస్తూ 
దానివల్ల తనకొచ్చే " పైసల " గురించి లొట్టలేసుకుంటూ పైశిచికానందంతో ఉబ్బితబ్బిబు అయ్యే కెమెరామన్ పాటించేది పత్రికా స్వేచ్ఛ అయితే మరి మానవత్వం మాటేంటి ?


ఒక సైకో ఒక అమ్మాయిని నడిరోడ్డుమీద నరుకుతుంటే విచక్షణా రహితంగా 
చిత్రీకరించే వ్యక్తి యొక్క మనస్తితిని ఏమని ఊహించాలి 
ఇదంతా "పైసల" కోసమేగా? 


ఒక తల్లి ఆక్సిడెంట్ లో తన బిడ్డని  కోల్పోయి 
భోరుభోరున విలపిస్తుంటే తన కెమెరా తో జూం చేసి 
వివిధ పిచ్చి ప్రశ్నలతో వేధించే వాళ్ళని ఏమని పరిగణించాలి 
ఇదిఒక పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఆత్మవంచన కాదా?


ఎవరో ఏదో కారణం తో ఎక్కడో ఓ చోట క్షణికావేశంలో అల్లర్లు సృష్టిస్తే 
దానిని చిత్రీకరించి పదేపదే చూపించి అల్లర్లు మరీ విజ్రభించేటట్లు 
చేస్తున్న పత్రికా స్వేచ్ఛ సమాజ శ్రేయస్సు కోసం  
వుపయోగపడుతున్నదా ??


మారణ హోమం సృష్టించిన తీవ్రవాదులని మట్టుబెట్టటానికి కమెండోలు 
ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే దానిని లైవ్ లో టెలికాస్ట్ చేసి దానితో 
తీవ్రవాదులు తప్పించుకుని పోయేట్లు చేయబోయిన మీడియా 
ఏవిధంగా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించగలదు 
తమ "పైసలు" గురించి తప్ప ??


దేశ భద్రతకే ముప్పువాటిల్లేటట్లు చేస్తున్న కొందరు మూర్ఖులని 
మరింతగా హీరోలని చేస్తూ డిబేట్లు పెట్టి మరింత విశ్లేషించి 
మన బలహీనతల్నిశత్రు దేశాలకు మరింతగా కళ్ళకు కట్టినట్లు చూపించే మీడియాని ఏవిధంగా సమర్దించగలం ? దేశద్రోహుల చేష్టలకన్నా వీరివి అత్యంత తీవ్రతరమైనవిగా అనిపించడంలేదా ???


ఇదేనా పత్రికా స్వేచ్ఛా ???????????

Saturday, 24 March 2012

రష్యా లో ఫిబ్రవరి వింటర్ ఫెస్టివల్

రష్యాలో(సబర్బ్) ఫిబ్రవరి నెలలో ఇరుగు పొరుగు కలసి ఎంతో 
ఉత్సాహంగా జరుపుకునే వింటర్ ఫెస్టివల్  

Thursday, 22 March 2012

Saturday, 10 March 2012

చారిత్రాత్మక కట్టడాలు






                                                 

                               
                             అమూల్యమైన వాటిని మనం వాడుతున్న తీరు 


Wednesday, 7 March 2012

శుభాకాంక్షలు


అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు

మహిళలకు ప్రత్యేక మహిళాదినోత్సవ హోలీ శుభాకాంక్షలు

Thursday, 1 March 2012

తమ్ముడి ప్రేమ

ఆ పసివాడిని చూస్తే జాలి తో హృదయం ద్రవించక మానదు ఎవరికైన!
ఎంతటి దుఖం మనస్సులో వుంచుకుని కుమిలిపోయాడో పాపం రాజేష్

నడిరోడ్డుమీద పదిమంది చూస్తూ వుండగా అక్కని గొంతుకోసి చంపుతుంటే
ఆ పదిమందీ చూస్తూనే వుండిపోయారు ఘోరాన్ని ఆపకుండా!!

తర్వాత టీవి వాళ్ళు పేపరు వాళ్ళు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు
అరచి గోల చేసి హమ్మయ్య ఏదో సాదించేసాం అని కావలిసిన పబ్లిసిటీ
సంపాదించుకుని ఎంతోతేలికగా మర్చిపోయి మరోసంఘటన దొరకగానే
మళ్ళీ అదే స్వలాభం కొరకు నానా గొడవ చేసాస్తారు.

అంతెందుకు మళ్ళీ అదే ప్రభుద్దులు, "చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా?"
"హింసకు ప్రతిహింస సరి అయినదేనా" " అసలు మనం నాగరిక ప్రపంచంలో వున్నామా "
వగైరా వగైరా డైలాగులతో కావలిసిన ప్రచారం దక్కేలా చూసుకుంటారు .

అయ్యో పాపం పిల్లవాడు నేరస్తుడైపోయడే అని మాత్రమే అనుకుని మర్చిపోకుండా
అటువంటి సంఘటన జరగటానికి దారితీసిన పరిస్థితులను అర్ధం చేసుకుందాము.
మన కంటికెదురుగా జరిగే అన్యాయాలను అరికట్టటానికి ప్రయత్నిద్దాము వీలయితే. 

అసలు మన చట్టం న్యాయం నడవ వలసిన రీతి లో నడిస్తే ఈ దుర్మార్గపు చర్యలూ
వాటి ప్రతీకారాలకు  ఆస్కారం వుండదేమో !