Thursday, 29 March 2012

పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా??

జీవితాన్ని ఇక ముందుకు సాగించలేక అత్యంత విషాదంగా 
ఒక రైతు పురుగులమందు తాగుతూ ఉంటే వివిధ భంగిమలలో చిత్రీకరిస్తూ 
దానివల్ల తనకొచ్చే " పైసల " గురించి లొట్టలేసుకుంటూ పైశిచికానందంతో ఉబ్బితబ్బిబు అయ్యే కెమెరామన్ పాటించేది పత్రికా స్వేచ్ఛ అయితే మరి మానవత్వం మాటేంటి ?


ఒక సైకో ఒక అమ్మాయిని నడిరోడ్డుమీద నరుకుతుంటే విచక్షణా రహితంగా 
చిత్రీకరించే వ్యక్తి యొక్క మనస్తితిని ఏమని ఊహించాలి 
ఇదంతా "పైసల" కోసమేగా? 


ఒక తల్లి ఆక్సిడెంట్ లో తన బిడ్డని  కోల్పోయి 
భోరుభోరున విలపిస్తుంటే తన కెమెరా తో జూం చేసి 
వివిధ పిచ్చి ప్రశ్నలతో వేధించే వాళ్ళని ఏమని పరిగణించాలి 
ఇదిఒక పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఆత్మవంచన కాదా?


ఎవరో ఏదో కారణం తో ఎక్కడో ఓ చోట క్షణికావేశంలో అల్లర్లు సృష్టిస్తే 
దానిని చిత్రీకరించి పదేపదే చూపించి అల్లర్లు మరీ విజ్రభించేటట్లు 
చేస్తున్న పత్రికా స్వేచ్ఛ సమాజ శ్రేయస్సు కోసం  
వుపయోగపడుతున్నదా ??


మారణ హోమం సృష్టించిన తీవ్రవాదులని మట్టుబెట్టటానికి కమెండోలు 
ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే దానిని లైవ్ లో టెలికాస్ట్ చేసి దానితో 
తీవ్రవాదులు తప్పించుకుని పోయేట్లు చేయబోయిన మీడియా 
ఏవిధంగా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించగలదు 
తమ "పైసలు" గురించి తప్ప ??


దేశ భద్రతకే ముప్పువాటిల్లేటట్లు చేస్తున్న కొందరు మూర్ఖులని 
మరింతగా హీరోలని చేస్తూ డిబేట్లు పెట్టి మరింత విశ్లేషించి 
మన బలహీనతల్నిశత్రు దేశాలకు మరింతగా కళ్ళకు కట్టినట్లు చూపించే మీడియాని ఏవిధంగా సమర్దించగలం ? దేశద్రోహుల చేష్టలకన్నా వీరివి అత్యంత తీవ్రతరమైనవిగా అనిపించడంలేదా ???


ఇదేనా పత్రికా స్వేచ్ఛా ???????????

10 comments:

  1. వాళ్ళు అలా చూపడమూ తప్పే...మనం విసుగు లేకుండా పదే పదే చూడటము తప్పే!

    ReplyDelete
    Replies
    1. స్పందించినందుకు ధన్యవాదాలండి

      Delete
  2. ఇదేనా పత్రికా స్వేచ్ఛా ???????????

    కాదు. ఇది వార్తా "వర్తకులు" చేసే ఘోరం. ఇవ్వాళ పత్రికలు లేవు. ఉన్నవి అన్నీ వార్తా వర్తకులు ప్రచురించే చెత్త కాయితాలు. వ్యాపార ప్రకటనల మధ్య వాళ్ళు వెర్రెక్కి వ్రాసే వ్రాతలు మనం వెతుక్కుని చదువుకోవాలి. ఆ వ్రాసే వాళ్ళకి ఒక్కొక్కొడికి ఒక్కో పిచ్చి, ఇజాల పిచ్చి, ప్రాంతాల పిచ్చి, కుల పిచ్చి, కరీర్ పిచ్చి, డబ్బు పిచ్చి అంతా కలిపి ఇవ్వాల్టి మీడియా. పత్రికలు మరణించటం 1974-75 లొ మొదలయ్యి, ఒక రెండు దశాబ్దాల క్రితం ఆ మరణం పూర్తయ్యింది.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు, కప్పగంతు గారు.

      Delete
    2. చాలా ధన్యవాదాలండి స్పందించి చక్కగా విశ్లేషించినందుకు

      Delete
  3. అనిల్29 March 2012 at 17:32

    ఎవరు చెప్పారు వార్తలకు విలువలేదని? ఇక్కడ కిలో ఐదారు రూపాయలు పలుకుతోంది.

    ReplyDelete
    Replies
    1. బరాబర్ దస్ కా తీన్ కిలో దేనా యారో :))

      Delete
    2. ధన్యవాదాలండి స్పందించినందుకు

      Delete
  4. నీ విశ్లేషణ మరియు కప్పగంతుల గారి స్పందన బాగుంది,నేటి పత్రికల నైజాన్ని బహిర్గితం పరచటంలో.
    అయితే శ్రీను,అక్కడ వాడి డ్యూటీ వాడు చేయ్యలి కదా!

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ హరి స్పందించినందుకు మరియు పోస్ట్ నచ్చినందుకు.
      నీవు చెప్పింది కరక్టే కానీ మానవత్వం మరచిపోకుండా డ్యూటీ చేస్తే మంచిదని
      నా అభిప్రాయం మాత్రమే.

      Delete