Monday, 31 December 2012
Saturday, 12 May 2012
అమ్మ కోసం తపన
!!!మాతృమూర్తులందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు!!!
అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు .ఎందుకంటే ప్రతివక్కరు శిశు దశ నుంచి ఆ ప్రేమను పొంది ఒక మనిషి గా పరిపక్వత చెందుతారు ఈ పరిణామంలో ప్రతిక్షణం ప్రతిఫలించే తల్లిప్రేమ నిర్వచించలేనిది.

మాతృదినోత్సవ సందర్భంగా మరియు వనజవనమాలి గారి అత్తమ్మలో అమ్మను చూస్తున్న వారి మహోన్నతమైన మనస్సుకు స్పందించి ,నాకు దగ్గరిబందువులలో ఒక అమ్మ దీనమైన జీవితకథ గురించి ఈ పోస్ట్ రాయాలనిపించింది.
ఆ అమ్మ జీవితచరమాంకంలో అనుభవిస్తున్న శేష జీవితాన్ని చూస్తే హృదయం ద్రవించక మానదు.
ఒక విషయమేమిటంటే ఆమె ఆరోగ్యంగా వున్నపుడు సంతానమే కాకుండా బంధువర్గం అంతా ఎంతో ప్రేమగా వుండేవారు.కాని నిజమైన అవసరమైన అవసానదశలో అందరూ దూరమయ్యారు సేవ చెయ్యవలసిన పరిస్తితి వస్తుందనే భయంతో .
కూతుర్లమీద ప్రేమతో ఎప్పుడు తపించే ఆమె ,వాళ్ళు నన్ను చూడటంలేదే అని కాకుండా నేను వాళ్ళని చూడలేకపోతున్నాను అని ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది.వాళ్ళ వాదన ఏమంటే మా సంసారాలు మాపిల్లలని మేము చూసుకోవాలి కదా అని.కాని వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి పడే తపనలాంటిదే కదా ఆమెది కూడా అని ఎంతో కన్వినిఎంట్ గా విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది .
కూతుర్లుకూడా మాతృమూర్తులే కదా మరి ??
ఆమె కోడలు కూడా ఆమె చాదస్తాన్నే విసుక్కుంటుంది కాని తన తల్లిలాగా ఎప్పటికీ గౌరవించలేకపోతున్నది. మరీ ఆమె కూడా మాతృమూర్తే కదా ????
వృద్ధులు అవసానదశలో శిశువులలాగ ప్రవర్తిస్తారు అని ఎక్కడో చదివాను. దానినే చాదస్తంగా భావించి విసుక్కుంటూ వుంటారు . కాని అందరూ వాళ్ళ చివరిదశలో ఎంతోకొంత చాదస్తంగా ప్రవర్తించబోతారని ఎందుకు ఆలోచించరు .మనుమలు మనుమరాళ్ళు విసుక్కుంటుంటే ఎందుకు వారించరు ???
ఆమె కొడుకు ఒక్కడే బాగా చూడటం కన్నా కుతుర్లూ, కోడలు, మనుమలు మనుమరాళ్ళు అందరూ ప్రేమగా మాట్లాడాలని ఆమె తపన , ఎవరూ చీదరించుకోకుండా విసుక్కోకుండా ఆమె జీవితం ముగియాలని ఆమె కొడుకు పడే తపన .
Monday, 30 April 2012
Saturday, 31 March 2012
కళ్ళు పోతాయండి బాబూ...
ఒకప్పటి పాటలు చూస్తూంటే ఎంతో చల్లగా
ఆహ్లాదంగా ఉంటుండేవి !
అబ్బో ఇప్పటి పాటలు
కళ్ళు జిగేల్మని కరకరలాడుతూ
కంటిచూపు దెబ్బతినేట్లు ఉన్నాయి !!
అప్పటి ఇప్పటి పాటల వ్యత్యాసం మీరే గమనించండి
అప్పటి అందాల హరివిల్లు లాంటి పాట (40 షాట్స్ సాంగ్ మొత్తానికి )
గుండె దడదడలాడించే ధడాక్ ధడాక్ పాట (140 షాట్స్ సాంగ్ మొత్తానికి )
ఒక సాంగ్ మొత్తం చూసేటప్పటికి కళ్ళమీద పడే స్ట్రెయిన్ ఎంత ఎక్కువో అర్ధమౌతుంది
ప్రస్తుత నటులు హావభావాల ప్రకటనలో ఎక్కువ కష్టపడకుండా చేసే గిమ్మిక్కు తప్ప
టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఏమీ కాదని నా అభిప్రాయము. అంతే కాకుండా చూడకూడనివి
చూపిస్తే కళ్ళు పోక ఏమౌతాయి ?????
ఆహ్లాదంగా ఉంటుండేవి !
అబ్బో ఇప్పటి పాటలు
కళ్ళు జిగేల్మని కరకరలాడుతూ
కంటిచూపు దెబ్బతినేట్లు ఉన్నాయి !!
అప్పటి ఇప్పటి పాటల వ్యత్యాసం మీరే గమనించండి
ఒక సాంగ్ మొత్తం చూసేటప్పటికి కళ్ళమీద పడే స్ట్రెయిన్ ఎంత ఎక్కువో అర్ధమౌతుంది
ప్రస్తుత నటులు హావభావాల ప్రకటనలో ఎక్కువ కష్టపడకుండా చేసే గిమ్మిక్కు తప్ప
టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఏమీ కాదని నా అభిప్రాయము. అంతే కాకుండా చూడకూడనివి
చూపిస్తే కళ్ళు పోక ఏమౌతాయి ?????
Thursday, 29 March 2012
పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా??
జీవితాన్ని ఇక ముందుకు సాగించలేక అత్యంత విషాదంగా
ఒక రైతు పురుగులమందు తాగుతూ ఉంటే వివిధ భంగిమలలో చిత్రీకరిస్తూ
దానివల్ల తనకొచ్చే " పైసల " గురించి లొట్టలేసుకుంటూ పైశిచికానందంతో ఉబ్బితబ్బిబు అయ్యే కెమెరామన్ పాటించేది పత్రికా స్వేచ్ఛ అయితే మరి మానవత్వం మాటేంటి ?
ఒక సైకో ఒక అమ్మాయిని నడిరోడ్డుమీద నరుకుతుంటే విచక్షణా రహితంగా
చిత్రీకరించే వ్యక్తి యొక్క మనస్తితిని ఏమని ఊహించాలి
ఇదంతా "పైసల" కోసమేగా?
ఒక తల్లి ఆక్సిడెంట్ లో తన బిడ్డని కోల్పోయి
భోరుభోరున విలపిస్తుంటే తన కెమెరా తో జూం చేసి
వివిధ పిచ్చి ప్రశ్నలతో వేధించే వాళ్ళని ఏమని పరిగణించాలి
ఇదిఒక పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఆత్మవంచన కాదా?
ఎవరో ఏదో కారణం తో ఎక్కడో ఓ చోట క్షణికావేశంలో అల్లర్లు సృష్టిస్తే
దానిని చిత్రీకరించి పదేపదే చూపించి అల్లర్లు మరీ విజ్రభించేటట్లు
చేస్తున్న పత్రికా స్వేచ్ఛ సమాజ శ్రేయస్సు కోసం
వుపయోగపడుతున్నదా ??
మారణ హోమం సృష్టించిన తీవ్రవాదులని మట్టుబెట్టటానికి కమెండోలు
ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే దానిని లైవ్ లో టెలికాస్ట్ చేసి దానితో
తీవ్రవాదులు తప్పించుకుని పోయేట్లు చేయబోయిన మీడియా
ఏవిధంగా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించగలదు
తమ "పైసలు" గురించి తప్ప ??
దేశ భద్రతకే ముప్పువాటిల్లేటట్లు చేస్తున్న కొందరు మూర్ఖులని
మరింతగా హీరోలని చేస్తూ డిబేట్లు పెట్టి మరింత విశ్లేషించి
మన బలహీనతల్నిశత్రు దేశాలకు మరింతగా కళ్ళకు కట్టినట్లు చూపించే మీడియాని ఏవిధంగా సమర్దించగలం ? దేశద్రోహుల చేష్టలకన్నా వీరివి అత్యంత తీవ్రతరమైనవిగా అనిపించడంలేదా ???
ఇదేనా పత్రికా స్వేచ్ఛా ???????????

Saturday, 24 March 2012
రష్యా లో ఫిబ్రవరి వింటర్ ఫెస్టివల్
ఉత్సాహంగా జరుపుకునే వింటర్ ఫెస్టివల్
Thursday, 22 March 2012
Saturday, 10 March 2012
Wednesday, 7 March 2012
Thursday, 1 March 2012
తమ్ముడి ప్రేమ
ఆ పసివాడిని చూస్తే జాలి తో హృదయం ద్రవించక మానదు ఎవరికైన!
ఎంతటి దుఖం మనస్సులో వుంచుకుని కుమిలిపోయాడో పాపం రాజేష్
నడిరోడ్డుమీద పదిమంది చూస్తూ వుండగా అక్కని గొంతుకోసి చంపుతుంటే
ఆ పదిమందీ చూస్తూనే వుండిపోయారు ఘోరాన్ని ఆపకుండా!!
తర్వాత టీవి వాళ్ళు పేపరు వాళ్ళు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు
అరచి గోల చేసి హమ్మయ్య ఏదో సాదించేసాం అని కావలిసిన పబ్లిసిటీ
సంపాదించుకుని ఎంతోతేలికగా మర్చిపోయి మరోసంఘటన దొరకగానే
మళ్ళీ అదే స్వలాభం కొరకు నానా గొడవ చేసాస్తారు.
అంతెందుకు మళ్ళీ అదే ప్రభుద్దులు, "చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా?"
"హింసకు ప్రతిహింస సరి అయినదేనా" " అసలు మనం నాగరిక ప్రపంచంలో వున్నామా "
వగైరా వగైరా డైలాగులతో కావలిసిన ప్రచారం దక్కేలా చూసుకుంటారు .
అయ్యో పాపం పిల్లవాడు నేరస్తుడైపోయడే అని మాత్రమే అనుకుని మర్చిపోకుండా
అటువంటి సంఘటన జరగటానికి దారితీసిన పరిస్థితులను అర్ధం చేసుకుందాము.
మన కంటికెదురుగా జరిగే అన్యాయాలను అరికట్టటానికి ప్రయత్నిద్దాము వీలయితే.
అసలు మన చట్టం న్యాయం నడవ వలసిన రీతి లో నడిస్తే ఈ దుర్మార్గపు చర్యలూ
వాటి ప్రతీకారాలకు ఆస్కారం వుండదేమో !

Saturday, 25 February 2012
బాల్యం
అమూల్యమైన బాల్యం !!
ప్రస్తుత పరిస్థితులలో పిల్లలు కోల్పోతున్న అమూల్యమైన
బాల్యాన్ని తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.
చిన్న చిన్న ఆటలు సరదాలు ఇప్పుడు ఏవి?
మూడో ఏట పుస్తకాల మోత మొదలై
పదిహేనవ ఏటితో IIT నే పరమావధి
అన్న మోతతో మనస్సులు బరువెక్కుతున్నాయి
మరొ రెండేళ్ళు కార్పొరేట్ కాలేజిల పుణ్యమా అని
కారిడార్లలో, మెట్లమీద, వరండాలలో,
చెట్లకింద రుబ్బుడు చదువుతో మిగతా బాల్యం గడిచిపోతుంది.
తర్వాత సహజ సున్నితత్వం కోల్పోయి
materialistic డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యి
మళ్ళీ జీవిత చక్రాన్ని తిప్పేస్తారు
మనుషులు మనుషుల్లా కాకుండా
యంత్రాల్ల బ్రతికేస్తూ జీవన గమనాన్ని సాగించేస్తారు !!!!

Thursday, 23 February 2012
Wednesday, 22 February 2012
దైవత్వం
సూర్యోదయం కాక మునుపే లేచి చన్నీళ్ళ స్నానం చేసి
అత్యంత భక్తి శ్రధ్ధలతో దేవుడిని పూజించి ఆ తరువాత
దైనందిన కార్యక్రమం లో పనిపిల్లని హింసించే గృహిణిలో దైవత్వం వుంటుందా?
అదే భక్తి శ్రధ్ధలతో దేవుడిని కొలిచి హడావుడిగా office కి వెళ్ళి
లంచం లేనిదే పనిముట్టుకోని వ్యక్తిలో దైవత్వం వుంటుందా??
వీరికన్నా ఇంకా ఎక్కువ భక్తి శ్రధ్ధలతో దేవుడిని ఆరాధించి
ఆ దేవుడి సొమ్మునే కాజేసే పూజారికి దైవత్వం వుంటుందా???
అసలు దేవుడిని నేనే అని అమాయకులని మోసం చేసే
దొంగ బాబాలలో దైవత్వం వుంటుందా????
ప్రతీ పండుగకు దేవుడి గుడులముందు బారులు తీరి
దేవుడిని దర్శించి, పులకించి పునీతులమైనామని మురిసి
మళ్ళీ ప్రతినిత్యం మోసాలు ,కుట్రలు ,కుతంత్రాలు చేస్తూ
జీవించే వాళ్ళు ఆలోచిస్తారా దైవత్వం గురించి ?????
కులమతాలకతీతంగా దేవుడిని నమ్మి కొలిచి
తరించే భారతీయులు నూటికి తొంభై శాతం అనుకుంటే
వారే సన్మార్గులని మనము భావిస్తే
నూటికి పది శాతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా
మోసగాళ్ళు దోపిడీదారులు
మన కర్మభూమిలో ఎందుకున్నట్లు??????

Sunday, 12 February 2012
భారతీయులు మహనీయులు!!
రోజూ త్రాగటానికి సరిగా నీళ్ళు లేకపోయినా!
రెందుపూటలా తినడానికి తిండి లేకపోయినా!
వుంటానికి గూడు లేకున్నా !
పిల్లలని చదివించడానికి బడి లేకపోయినా!
ఊరికి రోడ్డు లేకపోయినా!
ఉన్న రోడ్డు గతుకులమయం అయినా!
గతుకుల రోడ్డులొ ప్రయాణించే డొక్కు బస్సు వున్నా!
కష్టపడి పండించిన పంటలు పావలా కి కొనబడి రూపాయికి అమ్మబడుతున్నా!
లంచం కట్టకుండా డ్రయవింగ్ లయసెన్స్ తెచ్చుకోలేకపోయినా!
లంచం లేకుండ ఏ గవర్నమెంట్ పని చేయించుకోలేకపోయినా!
గవర్నమెంట్ పథకాలు అన్నీ పూర్తిగా దక్కకపోయినా!
నాయకులు,అధికారులు అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నా!
రక్షక భటులతో రక్షనే కొరవైనా!
న్యాయ వ్యవస్థలో పూర్తిగా న్యాయం దక్కకపొయినా!
కబ్జాదారులతో డ్రెయనేజ్ అస్థవ్యస్థమయి వర్షాకాలంలో రోడ్డులు కొట్టుకుపోతున్నా!
రోడ్డు మధ్యలో గుళ్ళు మసీదులు కట్టబడి ప్రయాణంలో ఇబ్బందులు వున్నా!
అన్నీ సర్దుకుపోతూ జీవచ్చాల్లా బ్రతుకుతూ,
ఎన్నికల్లో నాయకుల కటౌట్లకు దండలు వేస్తూ,
వాళ్ళ చెప్పులు నెత్తిన పెట్టుకుని,
మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూ మురిసిపోతున్న
మన భారతీయులు మహనీయులు కారా????

Wednesday, 8 February 2012
మన క్రికెట్
మన దేశం లో క్రికెట్ అనేది ఒక ఆట అని మరచిపోయారేమో అని అనిపిస్తుంది ప్రస్తుతం.
ఆటగాళ్ళకు డబ్బులు,ఆడించేవాళ్ళకు డబ్బులు,చూపించే వాళ్ళకు డబ్బులు,బెట్టింగ్ కాసే వాళ్ళకు
డబ్బులు ఇలా ఆట అంతా డబ్బు మయం.

ఒకోసారి ఆటగాడు duck ఔట్ అయి casual గా TV ముందు కూర్చున్నవారి ని ఒరే వెర్రోళ్ళలార
ఏమి చూస్తున్నార్రా అని అంటూ వెళుతున్నట్లు అనిపిస్తుంది.
ఆటగాళ్ళు బాగా ఆడితే డబ్బులు చాలా ఎక్కువగ వస్తాయి
బాగా ఆడకపోతే డబ్బులు కొంచం ఎక్కువగ వస్తాయి అంతే తేడా
My dear youth ఆలోచించండి మనకి ఎంత time waste అవుతుందో క్రికెట్ వలన......
Thursday, 2 February 2012
వాణిజ్య ప్రకటనలు
ఒక product తయారు చెసే సంస్థ దాని marketing కోసం ఏమైన చెయవచ్చు.
కాని ఒక well established profession (?) లో ఉన్న heros, Ads లొకూడ సంపాదించేద్దమని నానా గడ్డి కరుస్తున్నారు
ఒక దొంగ కూడ ఇంకొక దొంగ area లో దొంగతనం చేయదం, అట్లానే ఒక బెగ్గర్ ఇంకొక బెగ్గర్ AREA కి
వెల్లి అదుక్కోవడం చేయరు ఎందుకంటే వాళ్ళు ఒక నీతిని పాటిస్తారు.
అదే మన great HEROS(??) minimum నీతిని వదిలేసి అదే profession లో వున్న ఇంకొక వ్యక్తి (MODELS) కడుపు కొట్టడం చేస్తున్నారు సిగ్గు యెగ్గు లేకుండా !!ఇది ఎంత హేయమైన చర్య!!!
ఎవడైన సరే ఇంకొకరికి అన్యాయం చేయని వాడే నిజమైన HERO నా అభిప్రాయంలో. ఏమంటారు???
Sunday, 29 January 2012
Idiot Box
కలుషితమౌతున్న మనసులు
ప్రతియొక్క ఛానెల్ prime time entertainment పేరుతొ గ్రుహిణులకు criminal attitude గురించి చూపించి చూపించి వారి social behaviour మార్పుకు కారణం ఔవుతున్నాయి.
గ్రుహిణిలని ఎందుకు అంటున్నానంటె ప్రతీ serial లొ family life గురించి ఉంటుంది కాని gent charectors మాత్రం డమ్మీలుగ చూపించి స్త్రీలని మాత్రం కఠిన హ్రుదయులుగ చూపిస్తున్నారు.
ఒక సెరిల లొ 999 episodes లొ వో స్త్రీ criminal nature గురించి చెప్పి చెప్పి 1000 వ episode లొ ఆమె మంచి మనిషి గా మారినట్లు చూపిస్తే all is well అని సరిపెడుతున్నారు. కాని ఈ లొపల జరగవలిసిన pollution జరిగిపొతుంది.
ఉదహరించాలంటే AIDS గురించి అవగాహన కోసం శ్రుంగార చిత్రాన్ని ఒపెన్ గా చూపించినట్లు(sorry మరి అంత భాదవేస్తున్నది).
దీనిగురించి ప్రతీ ప్రేక్షకురాలు ఆలోచించాలని నా మనవి .ఎందుకంటే commercial gain వక్కటే ప్రాధన్యమనుకునే producers, చూపించే channels, చేసే directors ఆలోచింపరు కదా !!!
ఇడియట్ బాక్స్ అని పేరు టివి కి ఎలా వచ్చిందో తెలియదు కాని ప్రస్తుతం క్రిమినల్ బాక్స్ అని అంటే సరిపోతుంది.
environment pollute చెస్తే దానికి ఒక control board ఉంది.మరి ప్రతీ రోజు, అదీ సంవత్సరాలు తరబడి
entertainment పేరుతొ గ్రుహిణుల మనస్సులని pollute చేస్తున్న serials ని ఏ board controlచెయ్యాలి.
సినిమాలకున్నటువంటి sensor board TV serials కి ఉండదా !

Subscribe to:
Posts (Atom)